లింగంపేట, వెలుగు : మండలంలోని గాంధీనగర్ గ్రామంలో గురువారం రాత్రి చిరుతపులి దాడిలో రెండు లేగదూడలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన షేక్ రజాక్ గ్రామ సమీపంలోని పశువుల కొట్టంలో ఆవులు, లేగదూడలను కట్టేసి ఉంచగా చిరుతపులి వచ్చి లేగదూడలను చంపిందని సర్పంచ్ దెగావత్బాబు తెలిపారు. దూడల విలువ రూ.50 వేలు ఉంటుందని, పరిహారం అందించాలని బాధితుడు అటవీశాఖ అధికారులను కోరాడు.
కామారెడ్డి ఎఫ్డీఓ రామకృష్ణ, ఎల్లారెడ్డి ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ వాసుదేవ్ సిబ్బంది తో కలిసి దూడల మృతదేహాలను పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. రాత్రి వేళల్లో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని చెప్పారు. చిరుతపులిని గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
