స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
  • ఇక ఎంత మంది సంతానం ఉన్నా పోటీకి అర్హులే  
  • ఆర్డినెన్స్‌‌‌‌కు గవర్నర్​ ఆమోదం 

హైదరాబాద్, వెలుగు:  స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదన్న నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌‌‌‌కు  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  ఆమోదం తెలిపారు. ఈ గెజిట్​తక్షణమే అమల్లోకి రానున్నది. కాగా, 1994లో ఉమ్మడి ఏపీలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.  గడిచిన 30 ఏండ్లలో పరిస్థితులు పూర్తిగా మారాయని ప్రభుత్వం ఆర్డినెన్స్‌‌‌‌లో పేర్కొన్నది.

 ఈ నిర్ణయంతో ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నోళ్లు కూడా సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్పీటీసీలాంటి పదవులకు పోటీ చేసేందుకు అర్హులవుతారు.  పోటీచేయాలని ఆసక్తి ఉండి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఆశావహులకు ఈ ఆర్డినెన్స్​కొత్త రాజకీయ అవకాశాలను కల్పించనున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.