
జవహర్నగర్, వెలుగు: మహిళను కాపాడబోయి ఇద్దరు చిన్నారులు క్వారీ గుంతలో పడి మృతిచెందారు. ఈ ఘటన జవహర్నగర్పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. అరుంధతి నగర్ లో నివసించే సర్జుల్యాదవ్కూతురు పుతుల్(10), కొడుకు రాహుల్(9), అతడి ఫ్రెండ్హేమంత్(12) శనివారం ఉదయం కాలనీ వెనక ఉన్న క్వారీ గుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా పుతుల్ పట్టుజారి క్వారీలో పడబోయింది. అక్కడే బట్టలు ఉతుకున్న స్వప్న అనే మహిళ చిన్నారిని బయటకు లాగి ఆమె లోపలికి పడింది. దాంతో రాహుల్, హేమంత్ఆమె చేయి పట్టుకుని బయటకు లాగి వారు క్వారీ గుంతలో పడిపోయారు. స్వప్న కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరూ చనిపోయారు.