V6 News

ఆర్‌‌టీకేల ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసిన మన కంపెనీలు

ఆర్‌‌టీకేల ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసిన మన కంపెనీలు
  • ఈ నెల 20 నాటికి లక్ష కిట్లు అందుబాటులోకి
    న్యూఢిల్లీ: యాంటీ బాడీ బేస్డ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ (ఆర్‌‌టీకే) తయారు చేసేందుకు మన దేశానికి చెందిన మూడు కంపెనీలకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. దీంతో వాటిలో రెండు కంపెనీలు కిట్ల తయారీని మొదలుపెట్టాయి. ఆర్‌‌టీకేల కోసం చైనాకు ఆర్డర్‌‌ పెట్టగా.. ఈ నెల 5కు రావాల్సినవి ఇంకా చేరుకోలేదు.. బుధవారం వరకు వెయిట్‌ చేసినా రాకపోవడంతో మన దేశంలోనే తయారీ మొదలు పెట్టారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆర్‌‌టీ–పీసీఆర్‌‌ (రివర్‌‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలీమర్‌‌ చైన్‌ రియాక్షన్‌) టెస్ట్‌ ద్వారా రిజల్ట్‌ వచ్చేందుకు ఐదుగంటలు టైమ్‌ పడుతుంది. అయితే ఆర్‌టీకేల ద్వారా చేస్తే అరగంటలో రిజల్ట్‌ తెలుస్తుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. న్యూఢిల్లీకి చెందిన వాన్‌గార్డ్‌ డయోగ్నస్టిక్స్‌, కేరళలోని హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌‌ లిమిటెడ్‌, గుజరాత్‌కు చెందిన వాక్స్‌టూర్‌‌ బయో లిమిటెడ్‌ కంపెనీలు ఈ నెల మొదట్లో మానుఫాక్చరింగ్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేసుకోగా.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌‌) శ్యాంపిల్స్‌ను వ్యాలిడేట్‌ చేసి కిట్‌లు తయారు చేసేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. దీంతో ఈ నెల 14న తయారీ మొదలుపెట్టామని, 20 నాటికి లక్ష కిట్లు అందుబాటులోకి తెస్తామని కేరళకు చెందిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌‌ లిమిటెడ్‌ నిర్వాహకులు చెప్పారు. కిట్లు తయారీకి కొంత ముడిసరుకును అమెరికా నుంచి తెప్పించామని, రోజుకు 25వేల కిట్లు తయారు చేసేలా ప్లాన్‌ చేస్తున్నామని టెక్నికల్‌ ఆపరేటర్స్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ సుబ్రమణియన్‌ చెప్పారు. “ మేం చైనా నుంచి లేదా అమెరికా నుంచి ఏమీ ఇంపోర్ట్‌ చేసుకోలేదు. అన్ని ఇక్కడి సరుకే వాడుతున్నాం. నెల రోజుల్లో కోటి కిట్లు తయారు చేయగల కెపాసిటీ ఉంది. కానీ వెండార్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇంకా సెట్‌ కాలేదు. లైసెన్స్‌ వచ్చిన 10 – 12 రోజుల్లో ప్రొడక్షన్‌ మొదలు పెడతాం” అని వాక్స్‌టూర్‌‌ బయో లిమిటెడ్‌ సీఈవో అండ్‌ మేనేజిండ్‌ డైరెక్టర్‌‌ కుశ్రూ అన్నారు. వాన్‌గార్డ్‌ కంపెనీ మరో రెండు మూడు వారాల్లో ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఈ కంపెనీలే కాకుండా మరికొన్ని ఇండియన్‌ కంపెనీలు కూడా కిట్ల తయారీకి ముందుకు వచ్చాయి. లైసెన్స్‌లు వచ్చిన వెంటనే పని మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా కంపెనీల నిర్వాహకులు చెప్పారు.