ఇంటింటికీ ఏటా రెండు సిలిండర్లు ఫ్రీ: బడ్జెట్స్పీచ్‎లో సీఎం ప్రకటన

ఇంటింటికీ ఏటా రెండు సిలిండర్లు ఫ్రీ: బడ్జెట్స్పీచ్‎లో సీఎం ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మౌలికసదుపాయాల కోసం బడ్జెట్‎లో పెద్దపీట వేసింది. సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రతి సంవత్సరం హోలీ, దీపావళి కోసం ఇంటింటికీ రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది. మంగళవారం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో రూ.1,03,700 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టారు. దేశంలో తలసరి ఆదాయం విషయంలో ఢిల్లీ మూడో స్థానంలో ఉందని చెప్పారు. 

ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికీ తాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా 750 కిలోమీటర్ల రహదారులకు పూర్తిస్థాయిలో రీకార్పెటింగ్ చేయడంతో పాటు, ధూళి రహిత రహదారులుగా తీర్చిదిద్దుతామన్నారు. పాలం అగ్నిప్రమాదాన్ని ఉదహరిస్తూ, ఇరుకైన సందులు, అనధికార కాలనీల వల్ల మంటలను ఆర్పడం కష్టమవుతుందన్నారు. నగరంలోని యమునా నదికి ఆవలి ప్రాంతాన్ని అభివృద్ధి 
చేస్తామన్నారు.