
ఒకచోట చికిత్స పొందుతూ బాలుడుమృతి చెందితే..మరోచోట చికిత్స అందక యువకుడు చనిపోయాడు. తొలి ఘటనకొందుర్గ్ ప్రభుత్వాస్పత్రిలో, మరో సంఘటన నిలోఫర్ ఆస్పత్రిలో జరిగింది. మంగళవారం ఈ మరణాల నేపథ్యంలో డాక్టర్ల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
షాద్ నగర్, వెలుగు :రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందక మండలంలోని ఉమ్మెంతాల గ్రామానికి చెందిన కర్రెరాజు(23) మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. కర్రె రాజు కళ్లుపంట చేను దగ్గర అస్వస్థతకు గురయ్యాడు. కళ్లు తిరుగుతుండడంతో మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. కానీ, ఇక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉంది. కానీ, డాక్టర్లు రాలేదు. నర్స్‌లకు చెప్పినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. నిజానికి మంగళవారం పీఎం సురక్షా మాతృత్వ అభియాన్ కార్యక్రమం ఉన్నా.. డాక్టర్లు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే హాస్పిటల్ లో గతంలో డాక్టర్లు లేకుండానే గర్భిణులకు డెలివరీలు జరిగాయి.రాజు మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది.
నిలోఫర్ లో ఆస్పత్రిలో బాలుడు
నాంపల్లి , వెలుగు: నాం పల్లిలోని నిలోఫర్ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, కుటుం బసభ్యు లు ఆసుపత్రి ఎదుట మంగళవారం ఆం-దోళనకు దిగారు. బాధిత కుటుం బం కథనంప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొలుకులపల్లి గ్రామానికి చెందిన శివ (12)సైకిల్ మీద నుంచిసోమవారం కిం దపడి తీవ్రంగా గాయపడ్డాడు.కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు.కానీ, ఆపరేషన్ చేయకుండా రాత్రి విధుల్లోఉన్న డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించా రు.ఆపరేషన్ కోసం రక్తం అవసరం ఉందని చెప్పడంతో సోమవారం రాత్రి విద్యానగర్ లోనిరెడ్ క్రాస్ బ్లడ్ బ్యాం క్ నుంచి రక్తం తెచ్చారుకుటుంబ సభ్యు లు. అయినా, డాక్టర్లు అందుబాటులో లేక ఆపరేషన్ చేయలేదు. దీంతో పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం శివ చనిపోయాడు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఉన్నా..రక్తం అందుబాటులో లేదని సమయాన్ని వృథాచేశారని, డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలనివారు డిమాండ్ చేశారు. పోలీసుల భద్రతమధ్య ఆసుపత్రి సిబ్బంది.. మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించా రు. ఈ ఘటన పై స్పందించడానికి ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి.