కుక్కకాటేస్తే ఆస్పత్రికి తరలించాలి

కుక్కకాటేస్తే ఆస్పత్రికి తరలించాలి

నగరంలోని ద్వారకానగర్ లో ఓ ఐదేళ్ల బాలుడు జనవరి 26న ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. రెండు కుక్కలు బాలుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్సతో కోలుకున్నాడు. రెండ్రోజుల క్రితం కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 16 నెలల బాలుడిపై కుక్క దాడి చేసింది. ఇంటి ముందు బాలుడికి అన్నం తినిపిస్తున్న తల్లి మంచినీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లడంతో కుక్క ఎటాక్​చేసింది. పిల్లాడికి ముఖంపై గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇలా వరుసగా ఎక్కడో ఒకచోట కుక్కకాటు కేసులు అవుతూనే ఉన్నాయి.

కుక్కకాటేస్తే ఆస్పత్రికి తరలించాలి

పిల్లలను కుక్కలు గోర్లతో గీరినా, కొరికినా వెంటనే నల్లా కింద ఉంచి, సోప్ వాటర్​తో క్లీన్​చేయాలి. ఆ తర్వాత డాక్టర్​ దగ్గరకు తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్లు 5 డోసులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేస్తారు. ఇవి కుక్క కరిచిన వెంటనే ఒకటి వేస్తే, ఆ తర్వాత మూడో రోజు, 7, 14, 21 రోజులకు ఒకటి చొప్పున  ఐదు డోసులు వేయించాలి. స్కిన్​లేస్తే, కండకు కూడా లోతుగా గాయమైతే యాంటీ రేబిస్ ఇమ్యూనో గ్లోబలిన్​ఇంజక్షన్ ను గాయం చుట్టూ వీలైనంత త్వరగా వేయించాలి.  
 

- డాక్టర్​ కూరపాటి ప్రదీప్, చిన్న పిల్లల వైద్యనిపుణుడు 

వ్యాక్సిన్ అందుబాటులో ఉంది

ప్రభుత్వాస్పత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్​ అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ స్టాక్​తెప్పిస్తున్నాం. ఎవరికైనా కుక్క కాటు గాయమైతే వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకురావచ్చు. సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.

- డాక్టర్​వెంకటేశ్వర్లు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్