గజరాజులకు కోపమొచ్చింది.. నెటిజన్లు చెప్తున్న కారణాలు వింటే షాకే

గజరాజులకు కోపమొచ్చింది.. నెటిజన్లు చెప్తున్న కారణాలు వింటే షాకే

మనుషులతో మమేకమై జీవించే అతికొద్ది జంతుజాతుల్లో ఏనుగులు ముందు వరుసలో ఉంటాయి. చూడటానికి ఎంతో సౌమ్యంగా ఉన్నా వీటి ఆగ్రహానికి గురైతే బతికి బట్టగట్టే అవకాశాలు తక్కువే ఉంటాయి. కొన్ని సార్లు ఏనుగులు మనుషులపై దాడి చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ గామారడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గుంపులు గుంపులుగా అడవుల్లో కలియతిరుగుతూ ఎంతో సఖ్యతగా ఉండే గజరాజులకు కోపమొచ్చింది. ఒకదానిపై మరోటి పడుతూ కొట్టుకుంటున్నాయి. దంతాలతో దాడి చేసుకుంటున్నాయి. 


వీటి ధాటికి నేలపై దుమ్ము రేగుతూంటే పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకొరుగుతున్నాయి. ఒక్కసారిగా చూస్తే ఇది వీఎఫ్ ఎక్స్ మాయాజాలమా అనే భ్రాంతి కలిగిస్తోంది. ఇంతకీ ఈ మూగజీవాల మధ్య వచ్చిన సమస్య ఏమిటో మరి. ఏదిఏమైనా ఈ వీడియో జంతు ప్రేమికులను తెగ కలవరపెడుతోంది. కొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా ఇవి  మరో ఆడ ఏనుగు కోసమే కొట్టుకుంటున్నాయని కొందరు కన్ఫర్మ్ చేస్తున్నారు. మరికొందరేమో ‘రెండూ ఒకే ఏనుగును లవ్ చేయడం వల్లే ఈ చిక్కంతా’ అంటూ అంచనా వేస్తున్నారు.  గంటల వ్యవధిలోనే  ఈ వీడియోకి వేలల్లో లైకులు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

https://twitter.com/TheFigen_/status/1642906615375355905