గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)లో విషాదచాయలు అలముకున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చిన అనిల్ అనే యువకుడు నార్మ్లో శిక్షణ పొందుతుండగా, శుక్రవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
అంతకుముందు మూడు రోజుల క్రితమే దామోదర్‌రెడ్డి అనే మరో ఉద్యోగి భోజనం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఇద్దరు సహచర ఉద్యోగులు మరణించడంతో నార్మ్ ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది.
