విత్తన​ డీలర్లు పంట డబ్బులివ్వలేదని సూసైడ్

విత్తన​ డీలర్లు పంట డబ్బులివ్వలేదని సూసైడ్

పర్వతగిరి(సంగెం)/పెద్దపల్లి, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెంలో జరిగింది. రాజేశ్ ​కుమార్‌‌‌‌కు సంగెం శివారులో 3 ఎకరాల పొలం ఉంది. పక్కనున్న గవిచర్లలో మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. భారీ వర్షాల కారణంగా విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజేశ్ సోమవారం పురుగుల మందు తాగగా.. ఎంజీఎం హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

విత్తన​డీలర్లు పంటకు సంబంధించిన డబ్బులివ్వలేదని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సారయ్య(59) బయో సీడుకు సంబంధించిన వరి మేల్, ఫిమేల్ పంట వేశాడు. డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పి, పంటను సీడ్ కంపెనీకి చెందిన మొగిలి, మహేశ్‌‌ తీసుకుపోయారు. డబ్బులివ్వకపోవడంతో సారయ్య మంగళవారం పురుగుల మందు తాగి సూసైడ్​ చేసుకున్నాడు.