
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒకే నెంబరుతో ఇద్దరు రైతులకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చారు… సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారులు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన అంజిరెడ్డి, రంగనబోయిన ఎల్లవ్వకు… రెండు ఎకరాల వేరు, వేరు భూమిని ఒకే సర్వే నెంబర్ తో పాసు పుస్తకం ఇచ్చారు. దీంతో తమకు ప్రభుత్వం నుంచి రైతుబంధు సాయం అందడం లేదని చెబుతున్నారు రైతులు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మిరుదొడ్డి తహశీల్దార్ పద్మారావును అడిగినా…. తమ పరిధిలో జరిగిన తప్పు కాదంటున్నారని ఆందోళన చెందుతున్నారు రైతులు.