
క్రిస్మస్‌కి ‘ధమాకా’, సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు రవితేజ. మరోవైపు అతను హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి సుధీర్ వర్మ రూపొంది స్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిస గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం స్పెషల్ సాంగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు.
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్ చేతుల మీదుగా ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇందులో రవితేజ లాయర్ పాత్రలో కనిపించ నున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. సుశాంత్ కీ రోల్ చేస్తున్నాడు. రవితేజ, అభిషేక్ నామా కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించారు.