గంజాయి మత్తులో కొట్టి, వేలు తెంపేశారు!

గంజాయి మత్తులో కొట్టి, వేలు తెంపేశారు!
  • ఇద్దరు యువకుల దాడి  
  • గాయపడ్డ దంపతులు  
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన

మంచిర్యాల, వెలుగు: గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అడ్డుకునేందుకు వెళ్లిన దంపతులపై దాడికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. అండాళమ్మ కాలనీకి చెందిన దారంగుల రాజు, దారంగుల శివ సోమవారం గంజాయి తాగిన మత్తులో అదే కాలనీకి చెందిన కుంచపు రాజుపై బండరాళ్లతో దాడికి దిగారు. అటుగా వెళ్తున్న సాయిలు, లక్ష్మి దంపతులు వారిచేందుకు  యత్నించారు. దీంతో సాయిలుపై దాడి చేయడంతో పాటు లక్ష్మి కుడి చేతి చూపుడు వేలును రాజు కొరికి తెంపేశాడు.  

నిందితులు వెంటనే పారిపోయారు. స్థానికులు గాయపడ్డ దంపతులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రమోద్​రావు తెలిపారు. రవితేజ, శివ గంజాయికి బానిసలుగా మారి పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారని, కాలనీలో తరచూ గొడవలు, దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు.