గడ్డెన్న ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్

గడ్డెన్న ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్

భైంసా, వెలుగు: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చింది. గురువారం ఉదయం 13,277 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో రాగా రెండు గేట్లను ఎత్తిన అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలిపెట్టారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.60 మీటర్లు ఉందని, మొత్తం 1.77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.