లండన్ లో వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకులు మృతి..

లండన్ లో వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకులు మృతి..

లండన్ లో వినాయక నిమజ్జనంలో తీవ్ర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ యువకులు మృతి చెందారు. మంగళవారం ( సెప్టెంబర్ 2 ) జరిగిన ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో హైదరాబాద్ కి చెందిన చైతన్య, రిషితేజ మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నదుర్గల్ కి చెందిన తర్రె చైతన్య యాదవ్ MSC చదవడం కోసం ఏడు నెలల క్రితం లండన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే ప్రమాదంలో మృతి చెందిన మరో యువకుడు రిషితేజ ఉప్పల్ వాసిగా గుర్తించారు పోలీసులు.

మంగళవారం వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చైతన్య, రిషితేజ అక్కడికక్కడే మరణించగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

►ALSO READ | వరంగల్ జిల్లాలో 723 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్..

ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువకులు అర్థాంతరంగా మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు. కొడుకుల భవిష్యత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వారి హఠాన్మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.