ఇద్దరు ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారుల బదిలీ

 ఇద్దరు ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారుల బదిలీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యారు. ఏసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఏఆర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర పోలీస్‌‌‌‌‌‌‌‌ అకాడమీ అడిషనల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేశారు. హోంగార్డ్స్‌‌‌‌‌‌‌‌, టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ డీఐజీగా పనిచేస్తున్న 2009 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి అంబర్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝాను రాచకొండ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌ సీపీ (అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌)గా బదిలీ చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.