
- బైక్, ఆటో ఢీ కొని ఉద్యోగి..
- ఆర్టీసీ బస్సు ఢీకొని పీఈటీ.. నిర్మల్ జిల్లాలో ఘటనలు
భైంసా/కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీర్ మండలం గోడాపూర్ కు చెందిన గరికె ప్రవీణ్(32), భైంసాలో ఉంటున్నాడు. అతడు ఆదివారం రాత్రి నిజామాబాద్ నుంచి బైక్ పై భైంసాకు వెళ్తున్నాడు. ముథోల్ వైపు నుంచి ఆటో వస్తూ.. దేగాం సరస్వతీ నగర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ స్పాట్ లో చనిపోయాడు. అదేవిధంగా భైంసా టౌన్ శివారులోని సేవాలాల్ చౌక్ వద్ద జరిగిన యాక్సిడెంట్ లో ముథోల్ ఆశ్రమ పాఠశాల పీఈటీ చనిపోయాడు.
కుభీర్ మండలం సిర్పెల్లి తండాకు చెందిన ఆడె నరేశ్(45) సోమవారం ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు బైక్ పై భైంసా మీదుగా ముథోల్ కు బయలు దేరాడు. ఖాన్ ఆటోనగర్ రూట్ మీదుగా భైంసా–బాసర రూట్ పైకి చేరుతుండగా నిజామాబాద్ నుంచి భైంసా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన నరేశ్ ను108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుతో భైంసా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.