కరోనా రూల్స్​ పాటించలేదని 2 లక్షల చలాన్లు

కరోనా రూల్స్​ పాటించలేదని 2 లక్షల చలాన్లు

రూ.13 కోట్లు వసూలు చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: కరోనా రూల్స్​ పాటించలేదని 2 లక్షల మందికి ఢిల్లీ పోలీసులు చలాన్లు జారీ చేశారు. వీరిలో మాస్కులు ధరించనివాళ్లే ఎక్కువ మంది. ఫిజికల్ డిస్టెన్స్ పాటించని, పబ్లిక్ ప్లేసెస్ లో ఉమ్మేసిన వారికీ ఫైన్ వేశారు. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ చలాన్లు జారీ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. 15 పోలీసు జిల్లాల్లో 2 లక్షల 60 వేల 991 మందికి చలాన్లు జారీ చేసి రూ.13 కోట్ల ఫైన్ కలెక్ట్ చేసినట్లు చెప్పారు. వీరిలో మాస్కులు పెట్టుకోనివారు 2 లక్షల 33 వేల 545 మంది, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసిన 2,819 మంది, ఫిజికల్ డిస్టెన్స్ పాటించని 24,614 మంది ఉన్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 47 వేల 7 మాస్కులు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. కరోనా రూల్స్ పాటించని వారికి రూ.1000 వరకు ఫైన్ విధించేందుకు హెల్త్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్  పవర్ ఇచ్చారు. మొదటిసారి తప్పు చేసినవారికి రూ.500, రిపీట్ గా తప్పు చేసేవారికి రూ.1000 ఫైన్ విధించారు.

For More News..

టూరిస్ట్​ సెంటర్​గా మారనున్న పీవీ ఊళ్లు

5వేల కోసం మందు తాగించి చంపిండు