అథ్లెటిక్స్ లో తొలి రోజే ఇండియాకు రెండు మెడల్స్

అథ్లెటిక్స్ లో తొలి రోజే ఇండియాకు రెండు మెడల్స్

దోహా: ఆసియా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో తొలి రోజే ఇండియాకు రెండు పతకాలు వచ్చాయి. ఆదివారం జరిగిన జావెలిన్​ త్రోలో 60.22 మీటర్లతో అను రాణి రజతం నెగ్గింది. 5000 మీ. రన్​ను 15 నిమిషాల 36.03 సెకండ్లలో ముగించి మూడో స్థానంలో నిలిచిన పరుల్​ చౌదరి కాంస్యం గెలిచింది. కాగా, ద్యుతీచంద్‌ 100మీ. రేస్‌ సెమీస్‌ కు చేరుకుం ది. నాలుగో హీట్‌ లోద్యుతీ 11.28 సెకండ్లతో తన పేరి టే ఉన్న నేషనల్​ రికార్డును బద్దలు కొడుతూ టాప్​ ప్లేస్​ సాధించింది. .అయితే, మరో యువ అథ్లెట్‌ హిమాదాస్‌ వెన్ను నొప్పికారణంగా 400 మీటర్ల రేస్‌ హీట్‌ ను పూర్తి చేయలేకపోయిం ది. 800 మీటర్ల ఈవెంట్‌ లో జిన్సన్‌ జాన్సన్‌ ,400 మీ. రేస్‌ లో మహ్మద్‌ అనాస్‌ , అరోకి యా రాజీవ్‌సెమీస్‌ కు అర్హత సాధించారు. ట్రిపుల్‌ జంప్‌ లో ప్రవీణ్‌ చిత్రావల్‌ , మహిళల 1500 మీ. రేస్‌ లో గోమతిమరిముత్తు ఫైనల్‌ చేరారు.