
చెన్నైలో డీఎంకే ఎమ్మెల్యే కథవరాయణ మృతి
గురువారం సామి మృతి
తమిళనాడులో 24 గంటల్లో డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. గుడియాథం నియోజకవర్గానికి చెందిన ఎస్. కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. గత కొన్ని రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన.. చికిత్స నిమిత్తం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురి కావడంతో.. గుడియాథం నియోజకవర్గంలో గత సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన బై ఎలక్షన్లలో కథవరాయణ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.
కాగా.. గురువారం డీఎంకేకు చెందిన మరో ఎమ్మెల్యే కేపిపి సామి కూడా అనారోగ్యం కారణంగా మృతి చెందారు. సామి తిరువొట్టియార్ నియోజకవర్గం నుంచి 2016 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సామి మరణించిన 24 గంటల్లోనే డీఎంకేకు చెందిన మరో ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర బాధలో మునిగిపోయారు.
For More News..