V6 News

తిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు

తిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకుంది కస్టడీ. ఈ కేసులో కీలక నిందితులైన అజయ్, సుబ్రహ్మణ్యంను కస్టడీలోకి తీసుకుంది. నెల్లూరు జైలు నుంచి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్.. వారిని తిరుపతి  రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు  అనంతరం సిట్  కార్యాలయానికి తరలించారు. డిసెంబర్ 12 వరకు ఏసీబీ కోర్టు అజయ్, సుబ్రహ్మణ్యంను కస్టడీకి ఇచ్చింది. 

భోలేబాబా డెయిరీకి సంబంధించిన కీలక వ్యక్తి అజయ్ కుమార్ సుగంధి పూర్తిగా కెమికల్స్‌తో కల్తీ నెయ్యి తయారు చేసి, ఒక్క చుక్క కూడా పాలు కొనకుండా టీటీడీకి సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో ఇప్పటికే వెల్లడైంది. ఇక మరో నిందితుడు, మాజీ టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అర్హత లేని డెయిరీలకు టెండర్లు కట్టబెట్టేందుకు రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. 

►ALSO READ | ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలతో ప్రభుత్వం చర్చలు.. ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు..

డెయిరీ యజమానుల నుంచి వెండి ప్లేట్, శాంసంగ్ ఫోన్, నగదు (రూ.3.5 లక్షలు) వంటి బహుమతులు అందుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మైసూరు ల్యాబ్ నివేదికలో భోలేబాబా కంపెనీ నెయ్యి కల్తీ అని తేలినా ఆ విషయాన్ని దాచిపెట్టి, సాంకేతిక కమిటీలో అనుకూల నివేదికలు ఇచ్చారని నిర్ధారించారు. దీంతో నిందితుడు సుబ్రహ్మణ్యంను తిరుపతిలో అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.