
తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ తుది నోటీఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కోరుట్ల రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.