సూర్యాపేట జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మృతి

తౌక్టే తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షానికి పిడుగులు పడి ఇద్దరు మరణించారు. ఈ విషాద ఘటన నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అకాల వర్షంతో  పిడుగుపడి కారంగుల నాగమణి (40), వీరబోయిన భిక్షం(65)లు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వర్షం పడే సమయంలో బావి దగ్గర వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.