నేషనల్ హైవేపై వరద..ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు

నేషనల్ హైవేపై వరద..ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు

చేపల వేటకు వెళ్లిన  ఇద్దరు అన్నదమ్ములు భారీ వర్షాలతో వస్తున్న వరదలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మేడివాగు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. బండారుపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివాజీ, యువరాజు చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. చేపల వేటకని గురువారం ఉదయం రెండు బైక్ల మీద వీరిద్దరితో పాటు వారి అన్న మేడివాగు వద్దకు వెళ్లారు. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రామప్ప చెరువు పూర్తిగా నిండిపోయి బ్యాక్ వాటర్ పెరిగి ములుగు-–జంగాలపల్లి జాతీయ రహదారిని తాకాయి. అదేవిధంగా వరద నీరు కిలోమీటరు మేర డివైడర్ పైనుంచి చెరువులోకి వెళ్తున్నాయి. ఆ వరద నీటిలో అన్నదమ్ములిద్దరూ చేపల కోసం ప్రయత్నించ గా అదుపుతప్పి ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న వారి అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు, పో లీసులకు చెప్పడంతో వెంటనే గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పరిస్థి తిని సమీక్షించిన ఏఎస్పీ సాయి చైతన్య జాతీయ రహదారిపై చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఎవరూ ఆ దారిలో రాకుండా రాకపోకలను నిలిపి వేయించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలిం చారు. సాయంత్రం వరకు వెతికినా వారి ఆచూకీ దొరకలేదు.