బెల్లంపల్లిలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ల మృతి

బెల్లంపల్లిలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ల మృతి

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఇద్దరు అనారోగ్యంతో మృతిచెందారు. పట్టణంలోని బజార్ ఏరియాకు చెందిన నల్ల చక్రపాణి(83) తీవ్ర అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి చనిపోగా, హనుమాన్ బస్తీకి చెందిన గొడుగు మల్లయ్య (82) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం మృతిచెందారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఇరు కుటుంబాలను పరామర్శించారు.

వీరి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, 60 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డ గొప్ప నాయకులు అని కొనియాడారు. వినోద్ వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ కార్కూరి రాంచందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, లీడర్లు రమేశ్ బాబు, కె. రామ్మోహన్ తదితరులున్నారు.