
హాస్టల్ నుండి ఇనిస్టిట్యూట్ కి శిక్షణ నిమిత్తం వచ్చిన ఇద్దరు బాలికలు అదృశ్యం అయిన సంఘటన హైదరాబాద్ లోని మారేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ బాస్కో ప్రేమ్ సేవాసదన్ అనాధ ఆశ్రమం నుండి శిక్షణ కోసం గ్లోరి, కీర్తన అనే బాలికలు సికింద్రాబాద్ లోని హాస్టల్ కి వచ్చారు. యశోద ఫౌండేషన్ లో మూడు నెలలపాటు శిక్షణ తీసుకునేందుకు వచ్చిన ఈ బాలికలు స్థానికంగా హాస్టల్లో ఉంటున్నారు.
రోజు మాదిరిగానే వారు ఫౌండేషన్ కు హస్టల్ నుంచి బయటకు వెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. బాలికలు ఇన్ స్టిట్యూట్ కి రాకపోవడంతో అక్కడి మేనేజ్ మెంట్ హాస్టల్ కి సమాచారం ఇచ్చారు. హాస్టల్ లో కూడా వారు లేకపోవడంతో.. మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.