కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

V6 Velugu Posted on Jul 31, 2021

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దాచిగాం ఫారెస్ట్ ఏరియాలోని నాగ్ బేరన్,మర్సార్ మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. హతమైన ఇద్దరు టెర్రరిస్టులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియలేదు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు కశ్మీర్ జోన్ పోలీసులు. ఉదయం టెర్రరిస్టులున్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో  సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది సైన్యం. ఇదే సమయంలో సైన్యంపైకి టెర్రరిస్టులు కాల్పులు జరపారు. దీటుగా స్పందించిన సైన్యం...ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు. 

Tagged forest area, Search operation, Two Unidentifie, Terrorists Kill

Latest Videos

Subscribe Now

More News