మహిళా కానిస్టేబుళ్ల ధైర్యానికి హ్యాట్సాఫ్...

మహిళా కానిస్టేబుళ్ల ధైర్యానికి హ్యాట్సాఫ్...

బీహార్ లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బ్యాంకు దోపిడికి ప్రయత్నించిన ఓ ముఠా ఆట కట్టించారు. వారితో కొట్లాడి బ్యాంక్ దోపిడిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెందూరి  చౌక్ లోని  గ్రామీణ బ్యాంకులో బుధవారం  ముగ్గురు  దొంగలు బ్యాంకు దోపిడికి  ప్రయత్నించారు. బ్యాంకులోకి వెళ్లగానే  ఓ వ్యక్తి  గన్ తో  బెదిరించాడు.  వెంటనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు శాంతికుమారి, జుహీ కుమారి   తమ దగ్గర ఉన్న గన్   లతో  దొంగలపై ఎక్కుపెట్టారు. దీంతో వారు  కానిస్టేబుళ్ళపై  ఎదురు దాడి చేశారు. అయితే భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ  ఘటనలో  కానిస్టేబుల్ జుహీ కుమారికి గాయాలయ్యాయి.  ధైర్యంతో  బ్యాంక్ దోపిడిని అడ్డుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సీనియర్  పోలీస్ అధికారి ఓం ప్రకాశ్ ప్రశంసించారు. ఎలాంటి కాల్పులు జరపకుండా వారితో పోరాడారని.. కానిస్టేబుళ్లకు రివార్డ్ ప్రకటిస్తామని చెప్పారు.