మిషన్ భగీరథ సంపులో ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

మిషన్ భగీరథ సంపులో ఊపిరాడక  ఇద్దరు  కార్మికులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 9న  చర్ల మండలంలోని ఉంజుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ సంపులో మోటర్ అమర్చేందుకు దిగిన ఇద్దరు యువకులు  మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

గ్రామంలో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ (సంపు) లో మోటర్ అమర్చే పనులు జరుగుతున్నాయి.  నలుగురు కార్మికులు ట్యాంక్ లోపలికి దిగారు. అయితే లోపల ఆక్సిజన్ సరిపోక ఊపిరాడకపోవడంతో నలుగురు  అపస్మారక స్థితికి  వెళ్లారు. వెంటనే స్థానికులు  భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే   ఇద్దరు కార్మికులు  నీలం తులసీరామ్, కాకా మహేష్ గా చనిపోయారు.  మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 మృతుల కుటుంబాలు ఆస్పత్రి దగ్గర బోరున విలపిస్తున్నాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

►ALSO READ | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి