మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువతులు మృతి

మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువతులు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి ఇద్దరి ప్రాణాల్ని బలితీసుకున్నాడు. ఈ ఘటన మొయినాబాద్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని తాజ్ డ్రైవ్ ఇన్ హోటల్ల్ వద్ద హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు మహిళలలో ప్రేమిక (16)అనే విద్యార్థి ఘటనాస్థలంలోనే మృతి చెందింది. గాయపడ్డ సౌమ్య, అక్షయ అనే ఇద్దరు అమ్మాయిలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య చనిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. మరో యువతి అక్షయ పరిస్థితి కూడా విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితులంతా మొయినబాద్ లో నివాసులే. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. దీంతో ఈ దుర్ఘటన ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరోవైపు ఈ ప్రమాదానికి కారకుడైన సందీప్ రెడ్డి మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు ధృవీకరించారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 228 శాతం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సందీప్ రెడ్డి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

ఎర్రవల్లి రూట్లో భారీగా మోహరించిన పోలీసులు

భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి