రంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ప‌డి ఇద్ద‌రు యువ‌కులు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ప‌డి ఇద్ద‌రు యువ‌కులు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి మ‌రో వ్య‌క్తి కూడా గల్లంతయ్యాడు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో చెరువులో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఉదయం జల్‌పల్లి శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. ఆ యువకుడు ప్రమాద‌వశాత్తు కాలు జారి చెరువులో పడిపోగా అటుగా వెళ్తున్న మరో యువకుడు అతడిని గమనించి రక్షించేందుకు చెరువులోకి దిగాడు. అత‌న్ని కాపాడే ప్రయత్నంలో ఇద్దరూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో చెరువులో గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు చెరువు వద్ద కన్నీటిపర్యంతయ్యారు.అయితే, ఇద్దరు నీటమునిగి చనిపోయి ఉంటారని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది భావిస్తున్నారు.