
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
సూర్యాపేట: మేళ్ల చెరువు మండలం రామాపురం వద్ద విద్యుత్ షాక్ ఇద్దరు యువకుల ప్రాణాలు బలి తీసుకుంది. పొలం వద్ద మోటార్ కు సర్వీస్ వైరు నుండి వైరు లాగుతుంటే ప్రమాదవశాత్తు షాక్ కొట్టింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే.. ఇద్దరు యువకులు గిలగిలకొట్టుకుని విగతజీవులుగా మారిపోయారు. సమీపంలోని వారు చూసి గుర్తించేలోపే దారుణం జరిగిపోయింది. చనిపోయిన ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన రాము (24) కట్టె గోపి(25) గా గుర్తించారు. మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. సరదాగా సంక్రాంతి పండుగ చేసుకుని ఆనందంగా నెమరు వేసుకుంటున్న సమయంలోనే దారుణం జరిగిపోయిందని రోదించడం గ్రామస్తులను కంటతడిపెట్టించింది.
ఇవి కూడా చదవండి..
ఆ యువకుడి ఆదాయం రోజుకు 9 లక్షలు… ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు
కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. మాజీ మంత్రి అఖిలప్రియ చెప్పిన వివరాలే కీలకం?
కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు