
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఓ కోళ్ల వ్యాన్ రెండు బైక్ లను ఢికొట్టిన ఘటనలో ఒక బైక్ పై ప్రయాణిస్తున్నఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ – వరంగల్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మృతులు చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన బుర్ర శేఖర్, మదన్ లు గా గుర్తించారు. చెంజర్ల గ్రామానికి చెందిన కనిగంటి శ్రీకాంత్ కు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.