జేడీయూ అధికార ప్రతినిధి పదవికి త్యాగి రాజీనామా

జేడీయూ అధికార ప్రతినిధి పదవికి త్యాగి రాజీనామా

న్యూఢిల్లీ: జనతాదళ్‌‌ (యునైటెడ్‌‌) సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి ఆయన రిజైన్‌‌ చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పార్టీ వెల్లడించింది. ఆయన స్థానంలో జేడీయూ జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్‌‌ రంజన్‌‌ ప్రసాద్‌‌ను సీఎం నితీశ్‌‌ కుమార్‌‌‌‌ నియమించినట్లు తెలిపింది. కాగా, ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల జాతీయ అధికార ప్రతినిధి పదవికి తాను న్యాయం చేయలేకపోతున్నానని త్యాగి తెలిపారు. అయితే, పార్టీకి రాజకీయ సలహాదారుగా కేసీ త్యాగి ఉంటారని జేడీయూ నాయకులు వెల్లడించారు.