
హైదరాబాద్: ఇంటర్నేషనల్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఐహెచ్‌ఎఫ్) ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా జూనియర్ విమెన్స్ టీమ్ చాంపియన్‌గా నిలిచింది. గర్ల్స్ యూత్ కేటగిరీలో రన్నరప్ ట్రోఫీని గెలుచుకుంది. జూనియర్ ఫైనల్లో ఇండియా 48–17తో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. గర్ల్స్ యూత్ టైటిల్ ఫైట్‌లో ఇండియా 43–46తో బంగ్లాదేశ్ చేతిలోనే ఓడింది.
ఈ నెల 13 నుంచి 18 వరకు ఢాకాలో ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో రాణించిన ప్లేయర్లను జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అభినందించారు. గత రెండేళ్లుగా తాము పడిన కష్టానికి ఫలితాలు కనిపిస్తున్నాయన్నాడు. విమెన్స్ ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌ను కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నామని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.