భారత ప్రయాణికులపై బ్యాన్ విధించిన UAE

భారత ప్రయాణికులపై బ్యాన్ విధించిన UAE

గల్ప్ దేశమైన UAE కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో..థర్డ్ వేవ్ హెచ్చరికలతో యూఏఈ అలర్టైంది. దీంతో భారత్‌తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేధం జులై 21 వరకు అమలులో ఉండబోతోంది. భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా UAE నిషేదం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఏఈ సివిల్ ఏవియోషన్ అధారిటి తెలిపింది. అయితే, కార్గో, చార్టెడ్ విమానాలకు ఈ నిషేదం వర్తించదని తెలియజేసింది. UAEకి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు..దీంతో కరోనా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.