టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..

 టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..

టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు చోటు చేసుకుంది. టీ20 క్రికెట్ వచ్చి దాదాపు 17 ఏళ్లవుతున్నా..ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు ఎప్పుడు నమోదు కాలేదు. తొలిసారిగా..తాజాగా న్యూజిలాండ్, యూఏఈ జట్ల మధ్య జరిగిన జరిగిన టీ20 మ్యాచులో ఈ అరుదైన రికార్డు నమోదైంది. 

ఆగస్ట్ 17 నుంచి UAE, న్యూజిలాండ్ మధ్య 3-మ్యాచ్‌ల T20 సిరీస్ మొదలైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలోనే  ఇప్పటి వరకు టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ఈ మ్యాచులో నమోదైంది. ఇరు జట్లూ తమ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్లు కోల్పోయి ఈ రికార్డును సృష్టించాయి. 

అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే ఇరు జట్లు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది.  ఈ క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్ చాడ్ బోస్ తొలి బంతికే ఔటయ్యాడు. యూఏఈ బౌలర్ జునైద్ సిద్ధిఖీ ఈ వికెట్ తీశాడు. 

 అదే సమయంలో బ్యాటింగ్కు దిగిన యూఏఈ ఓపెనర్ మహ్మద్ వసీమ్ను కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ తొలి బంతికే పెవీలియన్ చేర్చాడు. 

మ్యాచ్లో న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్..20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆ తర్వాత 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన యూఏఈ 19.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ 5 వికెట్లు పడగొట్టాడు.