యూకో బ్యాంక్​ రెవెన్యూ రూ. 5,857 కోట్లు

యూకో బ్యాంక్​ రెవెన్యూ రూ. 5,857  కోట్లు

న్యూఢిల్లీ : యూకో బ్యాంక్​ నికర లాభం జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్లో 80 శాతం గ్రోత్​తో రూ. 223 కోట్లకు చేరింది. బ్యాడ్​లోన్లు తగ్గడం వల్లే లాభం పెరిగిందని బ్యాంకు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది క్యూ1 లో యూకో బ్యాంకుకు రూ. 124 కోట్ల నికర లాభం వచ్చింది. మొదటి క్వార్టర్లో మొత్తం ఆదాయం కూడా రూ. 5,857 కోట్లకు పెరిగింది. జూన్​ 2022 క్వార్టర్లో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 3,851 కోట్లే. జూన్​ 2022 క్వార్టర్లోని 7.42 శాతం నుంచి గ్రాస్​ నాన్​పెర్ఫార్మింగ్​ అసెట్లు తాజా క్వార్టర్లో 4.48 శాతానికి తగ్గిపోయాయి. 

అంటే బ్యాంకు అసెట్​ క్వాలిటీలో మంచి మెరుగుదలను సాధించింది. నెట్​ఎన్‌‌పీఏలు సైతం 2.49 శాతం నుంచి 1.18 శాతానికి తగ్గాయి. బ్యాడ్​లోన్లకు ప్రొవిజన్లు మాత్రం రూ. 389 కోట్లకు పెరిగినట్లు యూకో బ్యాంకు తెలిపింది. క్యాపిటల్​ యాడిక్వసీ రేషియో అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లోని 14.13 శాతం నుంచి జూన్​ 2023 క్వార్టర్లో 16.85 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. ఉద్యోగుల జీతాల పెంపుదల కోసం తాజా క్వార్టర్లో రూ. 90 కోట్ల ప్రొవిజన్​ చేసినట్లు యూకో బ్యాంకు వివరించింది.