యూకో బ్యాంక్​ లాభం రూ.505 కోట్లు

యూకో బ్యాంక్​ లాభం రూ.505 కోట్లు

కోల్​కత్తా: యూకో బ్యాంకు నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్​ క్వార్టర్లో 145 శాతం పెరిగి రూ. 504.52 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​ క్వార్టర్లో ఈ లాభం రూ. 205.4 కోట్లు మాత్రమే. తాజా క్యూ2లో ఆపరేటింగ్​ లాభం అంతకు ముందు ఏడాది క్యూ2 లోని రూ. 1,334.2 కోట్ల నుంచి రూ. 1,190 కోట్లకు తగ్గిపోయినట్లు యూకో బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది.

ప్రాంప్ట్​ కరెక్టివ్​ యాక్షన్​ (పీసీఏ) నుంచి బయటకొచ్చాక  ఇటీవలి కాలంలో ఇదే తమ బెస్ట్​ క్వార్టర్లీ రిజల్ట్‌ అని మేనేజింగ్​ డైరెక్టర్​ ఎస్​ ఎస్​ ప్రసాద్​ చెప్పారు. బ్యాంకు మొత్తం బిజినెస్​ రూ. 3,77,304 కోట్లకు చేరిందని, ఇచ్చిన అప్పులు రూ. 1,42,156 కోట్లని ఆయన పేర్కొన్నారు. రెండో క్వార్టర్​ చివరి నాటికి క్యాపిటల్​ అడిక్వసీ రేషియో 14.02 శాతానికి అంటే కొద్దిగా తగ్గిందని వివరించారు.  సెప్టెంబర్​ 2022 క్వార్టర్లో ఎన్​పీఏలు తగ్గాయని ప్రసాద్​ వెల్లడించారు.