జయ్షా కారణంగానే భారత్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడింది : ఉద్ధవ్ థాకరే

జయ్షా కారణంగానే భారత్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడింది : ఉద్ధవ్ థాకరే

ముంబై:శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్ షా కుమారుడు జయ్షా వల్లే భారత్ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిందని విమర్శించారు. బ్యాట్ కూడా పట్టడం రాని జయ్ షాను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండదియా (బీసీసీఐ) కార్యదర్శిని చేశారని అన్నారు. ఇది బీజేపీలో బంధుప్రీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. సాంగ్లీలో జరగిన శివసేన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు ఉద్ధవ్ థాకరే. 

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మహారాష్ట్ర రాజకీయ నేతలు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.. సాంగ్లీతో బహిరంగా సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు ఉద్దవ్ థాకరే. థాకరే చేసిన వ్యాఖ్యలు షా కుమారుడు జయ్ షాను టార్గెట్ చేయడంతో రెండు పార్టీల మధ్య మాటల యుధ్దానికి దారి తీసింది. శివసేన పార్టీలో చీలిక కొందరి దురుద్దేశంతో జరిగిందని అన్నారు ఉద్దవ్. 

బీజేపీని  విమర్శించేందుకు ఉద్దవ్ థాకరే .. జయ్ షా పేరును ఉపయోగించడం ఇదే మొదటిది కాదు. అంతకుముందు పన్వెల్ ర్యాలీలో కూడా బీసీసీఐ కార్యదర్శిగా జయ్ షా  ఎంపిక సరైంది కాదని అన్నారు ఉద్దవ్ థాకరే. అమిత్ షా గతంలో రాజవంశ రాజకీయాలను విమర్శించారు.. ముఖ్యంగా ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే రాజకీయ ఆశయాలను లక్ష్యంగా చేసుకొని విరుచుపడ్డారు. అయితే తన కుమారుడికి మద్దతుగా నిలిచారు ఉద్దవ్ థాకరే.  ఎన్నికల ద్వారా దేనికైనా నాయకత్వం వహించవచ్చన్నారు.