సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలం నిరూపించుకోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవితో పాటు ఎంఎల్సీగానూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానన్న ఆయన.. ప్రజాస్వామ్య విలువల్ని తప్పక పాటిస్తానని చెప్పారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ప్రజలను ఉద్దేశించి ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కృతజ్ఞతలు చెప్పారు. బాలా సాహెబ్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేశామని అన్నారు. ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని, అది ఎవరిదో అందరికీ తెలుసన్న ఠాక్రే.. సొంత పార్టీ వాళ్లే తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.