మోడీతో ఉద్ధవ్ భేటీ.. సీఏఏకు ఎవరూ భయపడొద్దు

మోడీతో ఉద్ధవ్ భేటీ.. సీఏఏకు ఎవరూ భయపడొద్దు

సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్( సీఏఏ)కు ఎవరూ భయపడకూడదన్నారు మహారాష్ట్ర సీఎం  ఉద్ధవ్ ఠాక్రే . సీఎం అయ్యాక తొలిసారి  కొడుకు ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో  భేటీ అయ్యారు. అనంతరం  మీడియాతో మాట్లాడిన ఆయన సీఏఏ,ఎన్ ఆర్సీ,ఎన్పీఆర్ గురించి  మోడీతో చర్చించామన్నారు. సీఏఏ పైన ఇప్పటికే తమ అభిప్రాయం చెప్పామన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన కాంగ్రెస్,ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

see more news

ఇండియాకు ట్రంప్ కూతురు అల్లుడు కూడా..

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ

కోహ్లీలో పస తగ్గిందా?.