హైదరాబాద్, వెలుగు: బిజినెస్ -టూ -బిజినెస్ (బీ2బీ) ప్లాట్‌ఫారమ్ అయిన ఉడాన్ 2023 ఆర్థిక సంవత్సరంలో తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా 2.25 బిలియన్ డాలర్ల విలువైన 2.3 కోట్లకుపైగా ఆర్డర్లను షిప్ చేసినట్టు ప్రకటించింది. ఈ ఆర్డర్లను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ పంపింది. వీటిలో ఫ్రెష్, ఎఫ్‌ఎంసీజీ, స్టేపుల్స్, ఫార్మా వంటి వస్తువులు ఉన్నాయి. దాదాపు 10 లక్షల టన్నుల ఉత్పత్తులు రవాణా అయ్యాయి.
900 మంది అమ్మకందారులు ఒక్కొక్కరు రూ. కోటి విలువైన అమ్మకాలను సాధించారు. గుర్గావ్, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, ఢిల్లీ బెంగళూరు నుంచి రిటైలర్లు నిత్యావసరాలు, డిస్క్రెషనరీ వస్తువులను రవాణా చేస్తున్నారని ఉడాన్ తెలిపింది.
