తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్

తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్

హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న సతీష్‌ చంద్రను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ. సయీద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయను గువాహటి హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్.షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.

మరిన్ని వార్తల కోసం..

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన