ఉజ్వల గ్యాస్ కస్టమర్లకు బిగ్ షాక్! ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ! మారిన రూల్స్ ఇవే!

 ఉజ్వల గ్యాస్ కస్టమర్లకు బిగ్ షాక్! ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ!  మారిన రూల్స్  ఇవే!

మీరు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా....  అయితే  రూ.300 సబ్సిడీకి సంబంధించిన రూల్స్ ఇప్పుడు మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఇచ్చే సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి  9 నుండి 4కు తగ్గించింది. పశ్చిమ ఆసియా దేశాలలో జరుగుతున్న ఘర్షణల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. దింతో దేశంలో 14.2 కిలోల వంటింటి గ్యాస్ సిలిండర్ ధర రూ.29 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో  సిలిండర్ ధర రూ.942 కి చేరింది.

గత నెల మార్చిలో రూ.60 పెరిగిన  గ్యాస్ ధర తర్వాత, కేవలం మూడు నెలల్లోనే మళ్ళీ  పెరగడం రెండోసారి. మొత్తంగా చూస్తే  ఈ కాలంలో రూ.89 పెరిగింది. రూ.300 గ్యాస్ సబ్సిడీ ఇంకా ఇస్తున్న.. ఇదివరకు లాగా అన్ని సిలిండర్లపై  సబ్సిడీ రాదు. గ్రామాల్లో ఉండే కోట్ల మంది మహిళలకు ఈ ఉజ్వల పథకం వర్తిస్తుంది. కానీ కొత్త నియమాల ప్రకారం అందరికీ ఒకేలా ప్రయోజనం ఉండదు. అర్హులు ఎవరు, ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు తీసుకున్నారు అనే దాన్ని బట్టి సబ్సిడీ ఆధారపడి ఉంటుంది.

 సబ్సిడీలో మార్పులు
గతంలో ఉజ్వల లబ్ధిదారులు ఏడాదికి 9 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్ పై రూ.300 చొప్పున మొత్తం రూ.2,700 సబ్సిడీ వచ్చేది. ప్రస్తుతం ఇకపై ఏడాదికి కేవలం 4 సిలిండర్లకు మాత్రమే ఒక్కో సిలిండర్ పై రూ.300 చొప్పున, అంటే మొత్తం రూ.1,200 మాత్రమే సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ కింద మొదటి 4 సిలిండర్ల తర్వాత తీసుకునే సిలిండర్లను మార్కెట్లో ఉన్న పూర్తి ధరకే కొనాల్సి ఉంటుంది.

 సబ్సిడీ ఎవరికి వస్తుంది?
ప్రభుత్వ కొత్త నిర్ణయం ప్రకారం, ప్రస్తుతం ఈ పథకంలో ఉన్నవారందరికీ ప్రతి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందుతుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో (DBT ద్వారా) జమ అవుతుంది. ఉజ్వల సబ్సిడీ పొందడానికి దరఖాస్తు చేసే వాళ్ళు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళ అయి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇంట్లో ఇంతకుముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. సబ్సిడీ డబ్బులు పడటానికి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇవే కాకుండా కొన్ని వర్గాల వారికి కూడా అర్హత ఉంటుంది:

ALSO READ : ట్రెడ్‌మిల్ వెనుక ఉన్న భయంకరమైన నిజం

కొత్త కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
*మొదట అధికారిక PMUY వెబ్‌సైట్‌కి వెళ్లి, 'Apply for New Ujjwala Connection' మీద క్లిక్ చేయాలి.
*మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని (ఇండేన్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పి గ్యాస్) సెలెక్ట్ చేసుకోవాలి.
*ఆ తర్వాత కంపెనీ వెబ్‌సైట్ పేజీ ఓపెన్ అవుతుంది.
*అక్కడ మీ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్‌ యూజర్‌నేమ్‌గా పెట్టుకుని, ఒక పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి.
*ఆ తర్వాత పూర్తి వివరాలు నింపి, ఈ-కేవైసీ (E-KYC) ప్రక్రియను పూర్తి చేయాలి.

 సబ్సిడీ ఎవరికి రాదు అంటే ?
*మీకు సాధారణ వంటింటి వినియోగ గ్యాస్ కనెక్షన్ ఉంటే (ఉజ్వల పథకం కింద కాకుండా సాధారణంగా తీసుకున్నది) సబ్సిడీ రాదు. 
*మీ కుటుంబం పేద కుటుంబాల లిస్టులో  లేకపోతే సబ్సిడీ అందదు.
*మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా లేదా గ్యాస్ కనెక్షన్ వివరాలు ఒకదానితో ఒకటి లింక్ అవ్వకపోయినా సబ్సిడీ డబ్బులు రావు.
*ఒక ఏడాదిలో 4 సిలిండర్ల కోటా పూర్తయిపోతే, ఆ తర్వాత తీసుకునే సిలిండర్లకు సబ్సిడీ రాదు.