ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ బ్రిటన్ ఆమోదం

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ బ్రిటన్ ఆమోదం
కొత్త రకం కరోనా  స్ట్రెయిన్‌తో ఇబ్బందులు పడుతున్న బ్రిటన్‌కు కాస్త ఉపశమనం కలగనుంది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఆక్సఫర్డ్‌ సైంటిస్టులు రూపొందించిన వ్యాక్సిన్‌ ఆస్ట్రజెనెకా కు బ్రిటన్‌ ఆవెూదం తెలిపింది. దీంతో యూకేలో భారీ స్థాయిలో  వ్యాక్సినేషన్‌ పక్రియ కొనసాగనుంది. కొత్త వేరియంట్‌తో అతలాకుతలం అవుతున్న బ్రిటన్‌ లో పరిస్థితి ఈ వ్యాక్సిన్ తో మళ్లీ గాడిలోపడుతుందన్న ఆశాభావం వ్యక్తమౌతోంది. 5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్రిటన్  భారీగా వ్యాక్సిన్ కు ఆర్డర్ ఇచ్చింది.