ఆఫీసులో ఉండి పశువుల్ని మేపుతున్న రైతులు.. ఎలాగంటారా?

ఆఫీసులో ఉండి పశువుల్ని మేపుతున్న రైతులు.. ఎలాగంటారా?

పశువుల్ని మేపడానికి అప్పటి తరానికి ఉన్నంత ఓపిక ఇప్పటి తరం రైతుల్లో ఉండట్లేదు. పశువుల్ని ఓ కంట కనిపెట్టడం కర్షకులకు ఇప్పటికీ ఓ పెద్ద టాస్కే. మేస్తూ.. మేస్తూ.. ఒక్కో పశువు ఒక్కో మార్గంలో వెళ్లూ ముప్పు తిప్పలు పెడుతుంటాయి. 

అయితే యునిటెడ్ కింగ్ డమ్(యూకే)కి చెందిన రైతులు స్మార్ట్ గా ఆలోచించారు. అక్కడి రైతులు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూనే పశువుల్ని కాస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి వాటిని మేపుతున్నారు.  

అదేలాగంటారా..  డిజిటల్ ఫెన్సింగ్ బాక్సులు ఇందుకు యూజ్ చేస్తున్నారు. ముందుగా అవి మేసే పొలాన్ని జియో ట్యాగింగ్ చేసి దాన్ని జీపీఎస్ కు అనుసంధానిస్తారు. స్పీకర్ ఉన్న జీపీఎస్ బాక్సుని పశువుల మెడలో వేస్తారు. 

అవి మేస్తూ.. పొలం బార్డర్ దాటాలని చూస్తే స్పీకర్ నుంచి సౌండ్స్, వైబ్రేషన్స్ వస్తాయి. దాంతో అవి వెనక్కి వెళ్లిపోతాయి. బాక్స్ కి లింక్ అయిన ఫోన్ రైతుల వద్ద ఉంటుంది. ఫోన్ లో చూస్తే పశువులు ఎక్కడ మేస్తున్నాయో తెలిసిపోతుంది. 

అవి తప్పిపోయినప్పుడు కూడా జీపీఎస్ ద్వారా ఈజీగా వాటి ఆచూకీ దొరుకుతోంది.  యూకే రైతన్నల స్మార్ట్ థింకింగ్ ఎట్లుంది.