రహస్యంగా పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని

రహస్యంగా పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని

లండన్: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన ప్రియురాలు కారి సిమండ్స్‌ను రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. సెంట్రల్ లండన్లోని కేథలిక్ చర్చిలోశనివారం వివాహం చేసుకున్నట్లు దసన్, మెయిల్ పత్రికలు ఇవాళ బ్యానర్ వార్తను ప్రచురించాయి. ఆదివారం పత్రికల్లో వచ్చే వరకు వీరి పెళ్లి విషయం హాజరైన కొద్ది మంది అతిథులకు తప్ప ఎవరికీ తెలియదు. చివరకు ప్రధాని మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులకు గాని, కార్యాలయంలోని అధికారులకు గాని తెలియనీయకుండా జాగ్రత్తపడ్డారు. 56 ఏళ్ల వయసున్న జాన్సన్‌, 33 ఏళ్ల వయసున్న తన ప్రియురాలు సైమండ్స్ తో 2019 నుంచి సహజీవనం చేస్తున్నారు. గతంలో రెండు పెళ్లిళ్లు జరుగగా ఇద్దరితోనూ విడిపోయారు. ఆయన రెండో భార్య వేలర్ కు నలుగురు సంతానం ఉన్నారు.  
తాజాగా మూడో పెళ్లిని చాలా సీక్రెట్ గా చేసుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ ఎజాన్సన్. ఎంగేజ్ మెంట్ చేసుకుని ఏడాది గడచిపోయినా పెళ్లి ఊసెత్తని ఆయన హఠాత్తుగా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.  బ్రిటన్ లో లాక్ డౌన్ కారణంగా పెళ్లికి 30 మంది వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపధ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సీక్రెట్ పెళ్లి గురించి చర్చి వర్గాలకు కూడా చివరి  నిమిషం వరకు తెలియలేదు. ప్రముఖ వ్యక్తి పెళ్లి జరగాల్సి ఉందన్న సమాచారంతో పెళ్లి జరిపించేందుకు బిషప్ మరికొంత మంది వచ్చారు. పెళ్లికి హాజరైన అతిథులకు కూడా చివరి నిమిషం వరకు పెళ్లి గురించి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు లండన్ లోని కేథలిక్ చర్చిని
మూసివేశారు. ఆ తర్వాత అరగంటకు బోరిస్ జాన్సన్ ప్రియురాలు కారీ సిమండ్స్ పెళ్లికూతురు మేకప్ లో తెల్లటి గౌన్ ధరించి లిమోజిన్ వాహనంలో అక్కడకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత బోరిస్ జాన్సన్, వారి సన్నిహతులైన కొద్ది మంది వచ్చారు. 
ఆదివారం ఉదయం ద సన్‌, మెయిల్‌ పత్రికల్లో మొదటి పేజీ బ్యానర్ వార్తగా వీరి రహస్య పెళ్లి గురించి రావడం కలకలం రేపింది. ఈ వార్తపై స్పందించేందుకు ప్రధాని అధికార ప్రతినిధి వ్యక్తిగతమంటూ మాట్లాడేందుకు నిరాకరించారు. సెంట్రల్‌ లండన్‌లో జరిగిన పెళ్లికి అతిథులను చివరి నిమిషంలో పిలిచారని,  జాన్సన్‌ కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులకు కూడా ఈ పెళ్ళి విషయం తెలియదని ఈ రెండు పత్రికల్లో రాశారు. బోరిస్ జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న బోరిస్ జాన్సన్, ఆయన ప్రియురాలు కారీ సిమండ్స్ ఎంగేజ్ మెంట్ గత ఏడాదే జరిగింది. గత ఏడాది 2020 ఏప్రిల్ లో లాక్ డౌన్ సమయంలో వీరికి ఒక బాబు కూడా పెట్టాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఎవరూ ఊహించని విధంగా నిన్న శనివారం పెళ్లి జరిగిపోయింది. బోరిస్ వివాహేతర సంబంధం విషయంలో బోరిస్ గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. తన సంబంధం గురించి ఒక అబద్దం చెప్పడంతో గత కన్జర్వేటివ్ పార్టీ పాలసీ బృందం నుంచి వైదొలగాల్సి వచ్చింది.