Cricket World Cup 2023: బజ్‌బాల్ ఎఫెక్ట్ : ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ప్రధాని వస్తున్నాడు

Cricket World Cup 2023: బజ్‌బాల్ ఎఫెక్ట్ : ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ప్రధాని వస్తున్నాడు

వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభమై వారం కావొస్తున్నా అసలు మజా అంతా ముందుంది. వీటిలో భాగంగా అక్టోబర్ 14 న జరగబోయే భారత్-పాకిస్థాన్ ఒకటైతే.. అక్టోబర్ 29 న భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ మరొకటి. ఈ రెండు మ్యాచుల కోసం స్టేడియాలు నిండిపోవడమే కాదు పలు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం ఇండియన్ స్టార్స్ సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లాంటి వారు ఈ మ్యాచుకు రావడం ఖాయమైంది. ఇక ఇంగ్లాండ్- ఇండియా మ్యాచుకు ఏకంగా బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ హాజరయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

మరో రెండు వారాల్లో సునాక్ భారత పర్యటనకు వచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేసే అవకాశం ఉంది.   అదే  సమయానికి  వరల్డ్ కప్ లో భారత్ లో ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్ ఉండడంతో భారత ప్రధాని మోడీతో రిషీ సునాక్ ఈ మ్యాచుకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీ20 సదస్సులో పాల్గొనేందుకు సునక్ గత నెలలో భారత్‌కు వచ్చారు. శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సునక్‌లు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.  

 
ఉత్తరప్రదేశ్ లక్నోలో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచు జరగనుంది. కాగా.. ఇంగ్లాండ్, ఇండియా ఈ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగాయి. ప్రస్తుతం రెండు మ్యాచులాడిన ఇంగ్లాండ్.. ఒక మ్యాచులో విజయం సాధిస్తే భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో గెలిచింది.