కిరాయి సైన్యాన్ని పంపుతోంది.. రష్యాపై బ్రిటన్​ ఆరోపణ

కిరాయి సైన్యాన్ని పంపుతోంది.. రష్యాపై బ్రిటన్​ ఆరోపణ

లండన్, కీవ్: ఉక్రెయిన్​తో జరుగుతున్న యుద్ధంలో ఫైట్​ చేసేందుకు రష్యా కిరాయి సైనికులపై ఆధారపడుతోందని బ్రిటన్​ పేర్కొంది. ఇప్పటికే వాగ్నర్​ గ్రూప్​ నుంచి వెయ్యి మంది ఫైటర్లను తూర్పు ఉక్రెయిన్​లోకి పంపించిందని, సిరియన్లను కూడా రిక్రూట్​ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. ఇవన్నీ చూస్తుంటే.. ఉక్రెయిన్​లో రష్యా సైనికులు పెద్ద సంఖ్యలోనే చనిపోయారని తెలుస్తోందని బ్రిటన్​ డిప్యూటీ పీఎం డామినిక్​ రాబ్​ చెప్పారు.

రాత్రంతా దాడులే.. చెర్నిహివ్​ గవర్నర్

కీవ్, చెర్నిహివ్​ సిటీల నుంచి తమ బలగాలను వాపస్​ తీసుకుంటామన్న హామీకి రష్యా కట్టుబడి ఉండట్లేదని చెర్నిహివ్​ రీజియన్​ గవర్న ర్​ ఆరోపించారు. మంగళవారం రాత్రంతా రష్యా దాడులు కొనసాగించిందన్నారు.